Girlfriend Killed: యూపీలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను బయటపెట్టారు. ఈ కేసులో నిందితుడికి, మహిళకు మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండేళ్ల క్రితం వీరి ప్రేమకు ప్రియురాలి భర్త అడ్డుగా మారడంతో ఇద్దరూ కలిసి అతని గొంతు నులిమి చంపేశారు. ఈ కేసులో రెండేళ్లుగా జైల్లోనే ఉన్న నిందితుడు.. బెయిల్ ద్వారా ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు.
Anurag Thakur: భారతీయ సంస్కృతి, సమాజాన్ని కించపరిచే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను అనుమతించబోం
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ప్రియురాలు నిరంతరం వేధింపులకు దిగేదని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు. దీంతో ఏమీ అర్థంకాక హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కొంచ్ కొత్వాలిలోని గాంధీనగర్ బక్షేశ్వర దేవాలయం సమీపంలో పొదల్లో మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని పోలీసులు చెప్పారు. ఆ మహిళను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ మెడపై పదునైన ఆయుధం ఉన్న గుర్తులు ఉన్నట్లు గుర్తించారు.
Malla Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, చీకటి రోజులు వస్తాయి.. మల్లారెడ్డి హాట్ కామెంట్స్
మరోవైపు హత్యకు గురైన మహిళ రోష్ని కుష్వాహకు మూలచరణ్ అలియాస్ ములుతో వివాహం జరిగింది. అంతకుముందే తన భర్తను హత్య చేశారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. ములు హత్య కేసును కూడా కలిపే ప్రయత్నం చేశారు. 2021లో ముల చరణ్‌ను అతని భార్య రోష్ని తన ప్రేమికుడి కోసం హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితులిద్దరూ.. బెయిల్‌పై బయటకు వచ్చారు. జూలై 17న రోష్ని తన పిల్లలతో కలిసి కొంచ్ పట్టణానికి వచ్చినట్లు విచారణలో ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సోను అక్కడకు చేరుకుని రోష్నిని మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. రోష్ని రోజూ డబ్బులు డిమాండ్ చేసేదని పోలీసుల విచారణలో నిందితుడు సోను తెలిపాడు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే జైపూర్ వెళ్లిందని.. వేరొకరితో పరిచయం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!