Site icon NTV Telugu

Atchannaidu: 3 రాజధానుల పేరిట చిచ్చు పెట్టారు.. హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తెచ్చారు..!

Atchannaidu

Atchannaidu

Atchannaidu : మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు.. మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తీసుకొచ్చారు అంటూ ఫైర్‌ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వైవీ సుబ్బారెడ్డి నోట జగన్ రెడ్డి మాట.. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే వైవీ నోట హైదరాబాద్ పాట అని ఆరోపణలు గుప్పించారు. విశాఖలో జగన్ రెడ్డి రూ.40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు. అందుకే ఇప్పటి వరకు విశాఖే రాజధాని అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. గతంలో అమరావతికి 30 వేల ఎకరాలుండాలని అన్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాని జగన్ అన్నాడు. అమరావతిని పూర్తి చేస్తానంటూ ప్రజల్ని నమ్మించాడు. అధికారంలోకి వచ్చాక అమరాతిని నాశనం చేశాడు అని విరుచుకుపడ్డారు.

Read Also: Jai Hanuman : జై హనుమాన్ హీరోగా కెజిఎఫ్ యష్?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

సీఎం జగన్‌.. యువతకు ఉద్యోగ, ఉపాధి దూరం చేశాడు అని విమర్శించారు అచ్చెన్నాయుడు.. రైతుల త్యాగాన్ని హేళన చేసి బూటు కాళ్లతో హింసించాడు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు హైకోర్టు బెంచి రాకుండా చేశాడు. మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. బినామీ ఆస్తుల కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి అరాచకం స్థాయి రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్ధమవుతుందన్న ఆయన.. 60 రోజుల తర్వాత అధికారంలోకి వస్తాం. అమరావతిని పూర్తి చేస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని.. రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని ప్రకటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Exit mobile version