Aston Martin DBX707: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ ఇండియాలో తన కొత్త కారును లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో టాప్ ఎండ్ కారు మార్కెట్లో చోటు సంపాదించడమే లక్ష్యంగా సంపన్నులకోసం తయారు చేసిందే ఈ ‘ఆస్టిన్ మార్టిన్ డీబీఎక్స్ 707’ మోడల్ కారు. దీని ధర వింటే అవాక్కవ్వాల్సిందే. ఎంతో తెలుసా ఏకంగా రూ.4.63 కోట్లు. డీబీఎక్స్ రెగ్యులర్ వెర్షన్ కంటే దీని ధర రూ.48 లక్షలు ఎక్కువ. తమ బ్రాండ్ లైనప్‌లో ఇండియాలో రిలీజ్ అయిన అత్యంత ప్రీమియం కారు ఇదేనని కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త ఎస్ యూవీ స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేద్దాం.
Read Also: Russia-Ukraine War: జపోరిజియాపై రష్యా రాకెట్లతో బీభత్సం.. పలువురి మృత్యువాత
బ్రిటీష్ అల్ట్రా లగ్జరీ ఆటోమేకర్ ఆస్టిన్ మార్టిన్ డిజైన్ చేసిన డీబీఎక్స్ 707 కారు.. పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో పాటు కొత్త ఫ్రంట్ స్ప్లిటర్‌తో కనిపిస్తుంది. కొత్త ఎయిర్ ఇన్‌టేక్, బ్రేక్ కూలింగ్ డక్ట్స్ వంటివి ఈ ఎస్‌యూవీ హైలెట్స్. డీబీఎక్స్ 707 ఇంటీరియర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. దీని లోపలి భాగంలో సెమీ అనిలిన్ లెదర్ అప్హోల్స్టరీ, స్పోర్ట్ క్విల్టింగ్‌తో కూడిన కార్పెట్లు ఉన్నాయి. పెర్ఫొరేషన్ సీట్లు, స్ప్లిట్- రిమ్ స్టీరింగ్ వీల్, లెదర్ హెడ్‌లైనింగ్ వంటివన్నీ ప్రీమియం లుక్, లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచుతాయి. ఈ కారు ఐదు డ్రైవ్ మోడ్స్‌తో వస్తుంది. వీటిలో ఒకదాన్ని ప్రత్యేకంగా డీబీఎక్స్ 707 కోసం రూపొందించారు. ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కోసం ‘టెర్రైన్’ మోడ్, మంచి టూరింగ్ కంఫర్ట్ కోసం ‘జీటీ’ సెట్టింగ్, రెస్పాన్సివ్ రోడ్ డ్రైవింగ్ కోసం ‘స్పోర్ట్’ మోడ్, సస్పెన్షన్, స్టీరింగ్, ఎగ్జాస్ట్ వంటి అన్ని అంశాల్లో సొంత ప్రాధాన్యతను కలిగి ఉండటానికి ఇష్టపడే కస్టమర్ల కోసం ‘ఇండివిజువల్’ మోడ్ ఉంటాయి. అయితే బీబీఎక్స్707 మోడల్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ‘స్పోర్ట్+’ మోడ్.. ఈ కారుకే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
Read Also: AAP MLA: పార్టీ కార్యకర్తతో ఎమ్మెల్యే పెళ్ళి.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా సీఎం వైఫ్
ఆస్టిన్ మార్టిన్ కంపెనీ ఈ కారును స్పెషల్ ఫీచర్లతో డిజైన్ చేసింది. దీని ట్విన్-టర్బో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ఊహకు మించిన పర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని లగ్జరీ ఎస్ యూవీల కంటే ఇదే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కావడం విశేషం. ఇది 707 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చిన డీబీఎక్స్707 కారు వెట్ క్లచ్‌ను ఉపయోగిస్తూ.. 30 శాతం వేగవంతమైన గేర్ షిఫ్ట్స్ అందిస్తుంది. ఈ ప్రత్యేకతలతో కేవలం 3.3 సెకన్లలో 0-100కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదు. ఇటువంటి అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ కారు.. లంబోర్ఘిని ఉరస్, ఫెరారీ పురోసాంగ్యూ, రోల్స్ రాయిస్ కల్లినన్, బెంట్లీ బెంటెగా వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.