Asia Cup 2023: ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాకిస్తాన్.. జులై 23న మ్యాచ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lets See India A vs Pakistan A Match in Emerging Asia Cup 2023 Final: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో యువ భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. బుధవారం పాకిస్తాన్-ఏతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 48 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48) టాప్ స్కోరర్. భారత బౌలర్లు రాజ్యవర్ధన్ హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) రాణించారు. ఆపై సాయి సుదర్శన్ (104; 110 బంతుల్లో 10×4, 3×6) సెంచరీ చేయడంతో భారత్ 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాకిస్తాన్ జట్లు ఇదివరకే ఎమర్జింగ్ వన్డే ఆసియా కప్ 2023 సెమీస్‌కు చేరాయి. అయితే ఈ టోర్నీలో దాయాదులు మరోసారి తలపడే అవకాశం ఉంది. శుక్రవారం జరిగే సెమీస్‌లలో బంగ్లాదేశ్‌ను భారత్, శ్రీలంకను పాకిస్థాన్ ఢీకొంటాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఆదివారం (జులై 23) కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఎమర్జింగ్ వన్డే ఆసియా కప్ 2023 ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్, పాకిస్తాన్ జట్లు బాగున్నాయి. బంగ్లాదేశ్‌ను భారత్, శ్రీలంకను పాకిస్థాన్ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ఆసియా కప్ 2023లో భారత్-పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు ఆరంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
Also Read: Netflix: నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం.. ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్ బంద్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!