Netflix: నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం.. ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్ బంద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netflix has ended password sharing in India: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘నెట్‌ఫ్లిక్స్’ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్ దేశంలో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయంపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ మెయిల్స్ పంపింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకుంటారో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక నుంచి సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టం చేసింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా ఉపయోగించుకునే వారికి షాక్ తగినట్లైంది.
మనలో చాలా మందికి నెట్‌ఫ్లిక్స్ పని చేసే విధానం గురించి అవగాహన ఉంది. ఒక వ్యక్తి బిల్లులు చెల్లిస్తే.. అతడితో పాటు చాలా మంది ఆ ఖాతాను ఉపయోగిస్తున్నారు. చాలా కాలంగా ఇలాగే జరుగుతోంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతీయులకు మొదటి ఎంపికగా మారినప్పటినుంచి ఇదే ప్రాసెస్ జరుగుతోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్థి పలుకుతోంది. పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేయనుంది. నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకున్న వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై ఓటీటీ సేవలు వినియోగించుకోవచ్చు.
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ఈ నిర్ణయాన్ని నెట్‌ఫ్లిక్స్ అకస్మాత్తుగా, హెచ్చరిక లేకుండా తీసుకున్నది మాత్రం కాదు. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల మధ్య పాస్‌వర్డ్ షేరింగ్ త్వరలో ముగించనుందని, త్వరలోనే చర్యలు తీసుకుంటుందని చాలా కాలంగా పలు నివేదికలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 100కు పైగా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను భవిష్యత్తులో అంగీకరించమని మే నెలలోనే కంపెనీ ప్రకటించింది. చివరకు నెట్‌ఫ్లిక్స్ ఆ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యం ఉన్న సబ్యులకు త్వరలోనే ఈ ఇమెయిల్‌లు వెళ్లనున్నాయి.
కస్టమర్ల అభిరుచి, బాష, సంతృప్తి మేరకే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీ షోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఖాతా దారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సదుపాయం పొందవచ్చని తెలిపింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను కుటుంబ సభ్యులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో నెట్‌ఫ్లిక్స్ తన ఫ్లాట్‌ఫాం ద్వారా పంచుకుంది. ఇక పాస్‌వర్డ్ షేరింగ్ తీసుకు వచ్చిన నేపథ్యంలో దాదాపు 60 లక్షల మంది కొత్త ఖాతాలు వచ్చాయట.
Also Read: IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!