Shivam Dube: నీ నుంచి కావాల్సింది బ్యాటింగ్ కాదు, బౌలింగ్.. బీసీసీఐ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే హైలెట్ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్‌మెంట్‌ను తెగ అట్రాక్ట్ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడేందుకు బాటలు వేసింది. ఇదిలా ఉంటే.. బీసీసీఐ శివమ్ నుండి కొత్త డిమాండ్ ను కోరుతుంది. దూబే తన బౌలింగ్ సామర్థ్యాన్ని కూడా చూపించాలని బీసీసీఐ చెబుతోంది. కాగా.. ఇండోర్‌లో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించగా.. శివమ్ కేవలం 32 బంతుల్లోనే 63 పరుగులు చేసిన తీరు అభిమానులకే కాదు మాజీ వెటరన్లకు కూడా ఫిదా అయిపోయారు. మొహాలీలో కూడా దూబే 60 పరుగులు చేశాడు.
Congress : పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు
Also Read
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
- CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
శివమ్ దూబే వీలైనంత ఎక్కువ బౌలింగ్ చేయాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతను కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే, జట్టుకు చాలా విలువైనవాడు అవుతాడని పేర్కొంది. హార్దిక్ లేని స్థానాన్ని భర్తీ చేయవచ్చని తెలిపింది. కాగా, ఇటీవల రంజీ ట్రోఫీలో శివమ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. శివమ్‌లో కనిపించిన అద్భుతమైన మార్పు చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన తర్వాత జరిగింది. కెప్టెన్ MS ధోని అతనికి చాలా నమ్మకాన్ని ఇచ్చాడు. దూబేని ప్రోత్సహిస్తూనే.. ధోని అతనిని ఆర్డర్‌లో ఎక్కువ బ్యాటింగ్ చేయడమే కాకుండా అతని బౌలింగ్‌లో కూడా ప్రోత్సహించాడు. దాని ఫలితం దూబే ఫిట్‌నెస్, విశ్వాసంలో స్పష్టంగా కనిపించింది.
HDFC Q3 Results: 34 శాతం పెరిగి.. రూ. 16,373 కోట్లకు చేరుకున్న నికర లాభం..
గత రెండు మ్యాచ్‌ల్లో అతని దూకుడు బ్యాటింగ్ తర్వాత.. మాజీ ఆటగాళ్లు, అభిమానులు దూబే భారీ షాట్‌లను యువరాజ్ సింగ్‌తో పోల్చారు. అయితే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల సత్తా ఉంది గనుక.. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..