Arvind Dharmapuri: తెలంగాణ రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేస్తే.. అందులో 2 నిజామాబాద్ పార్లమెంటుకు కేటాయించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్. జగిత్యాలకు తొందర్లోనే కేంద్రీయ విద్యాలయం కూడా మంజూరు అవుతుందని.. వరంగల్, ఆదిలాబాద్ లో బ్రౌన్ ఫీల్డ్, జక్రాన్ పల్లిలో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ వల్లనే జక్రాన్ పల్లి విమానాశ్రయం ఆలస్యం అవుతుందని, నిజామాబాద్ పార్లమెంటులో ఎక్కువ NRI లు ఉన్నారని ఆయన అన్నారు.
గత ప్రభుత్వం వాళ్లు తిరిగి వచ్చేలా చేస్తామని చెప్పిందని, కాకోపోతే ఆది చేయలేదని అన్నారు. ఇప్పటి ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదని, దానికి ఏడవాలో.. నవ్వాలో.. అర్ధమవడం లేదని ఆయన అన్నారు. ROB లకి పేమెంట్ లు విడుదల చేయాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కోరుతున్నాని, శిశుపాలుడు గతి కెసిఆర్ కి పట్టిందని ఆయన అన్నారు. సంవత్సరం నుండి ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉందని, 25 శాతం మందికి మాత్రమే రుణమాఫీ అయిందని ఇంకా 75 శాతం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: AAP vs BJP: కేజ్రీవాల్ అద్దాల బంగ్లా వీడియో వైరల్.. బీజేపీ ట్వీట్‌పై ఆప్ ఆగ్రహం
పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ ను మహారాష్ట్రకు తరలిస్తారని ప్రచారం జరుగుతుందని, అయితే అది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. తెలంగాణకే హెడ్ క్వార్టర్ వస్తుందని, అది కూడా ఇందూరుకే వస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా, తెలంగాణ అభివృద్ధి కెసిఆర్ చేయలేదని అన్నారు. వారందరు విగ్రహాల రాజకీయం చేస్తున్నారని, తెలంగాణను కెసిఆర్ దోచుకున్నారని ఆయన కిలాక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ తల్లి నగలును కాంగ్రెస్ దోచుకుందని, ప్రజలకు పనికి వచ్చేది రెండు పార్టీలు చేయడం లేదని, తెలంగాణని దోపిడీ చేసిన ముఠా కల్వకుంట్ల కుటుంబం అని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
రేవంత్ రెడ్డి కి బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదని, జిల్లాల్లో రేవంత్ రెడ్డి తిరగాలని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే ప్రజలు కాంగ్రెస్ భరతం పడతారని, దిక్కుమాలిన బస్సుల్లో ఎన్ని సార్లు తిరుగాలని మహిళలు అంటున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ మీద గుడపుటాని ఏంది రేవంత్ రెడ్డి అంటూ.. హైదరబాద్ మీద కుట్ర ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎవరికి లాభం కోసం హైదారాబాద్ లో రియల్ ఎస్టేట్ ను నడవకుండా చేసావని, కేటీఆర్ వెళ్ళింది వీకెండ్ రిట్రీట్ కా లేక వెల్ నెస్ రిట్రీట్ కా అని ఆయన అన్నారు.
Also Read: Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..
గుజరాత్ మోడల్ గురుంచి రేవంత్ రెడ్డి కి ఏమీ తెలుసునని, తెలంగాణను డెఫినెట్ గా గుజరాత్ లా మారుస్తాం అని ఆయన అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంను కాదు.. తెలంగాణ ను మారుస్తామని, రేవంత్ రెడ్డికి ఓల్డ్ సిటీకి వెళ్ళే ధైర్యం లేదని ఎద్దేవా చేసారు. తెలంగాణ తల్లి విగ్రహం పైన బిఆర్ఎస్ కు కమిట్మెంట్ లేదని, ఆ సమయంలో ఎందుకు ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన అన్నారు. కేసీఆర్ కొడుకు బాగా మాట్లాడుతున్నారని.. కేటీఆర్, కవిత లాంటి కొడుకు కూతురులు ఎవరికి ఉండరని, హరీష్ రావు లాంటి అల్లుడు ఉండరని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కెసిఆర్ రావడం లేదని, కేటీఆర్ ఆఫ్టరాల్ ఎమ్మెల్యే అంటూ.. ఇది యూజ్లెస్ ప్రభుత్వం అంటూ అటూ బిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలను ఏకి పడేసారు.