Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్దులకు సందేహ నివృత్తి చాట్ బొట్ పేరిట ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానం అందుబాటులో ఉంచనుంది.. పాఠశాలల డిజిటైజేషన్ ప్రక్రియలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చాట్ బోట్ అందుబాటులోకి తెచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ పాఠశాల విద్యా శాఖ. మొబైల్ యాప్ ద్వారా ఏఐ చాట్ బోట్ పని చేస్తుందని వెల్లడించింది ప్రభుత్వం.. ఈ మేరకు కొన్వే జీనియస్ ఏఐ సొల్యూషన్స్ సంస్థ తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్..
Read Also: Telangana BJP: ఢిల్లీకి కిషన్ రెడ్డితో సహా కీలక నేతలు.. ఇవాళ రాత్రికే అభ్యర్థుల తొలి జాబితా..!
ఇక, విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లు, పాఠశాలల్లో స్మార్ట్ బోర్డుల ద్వారా ఏఐ సందేహ నివృత్తి చాట్ బోట్ అందుబాటులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. తరగతి వేళలు ముగిసిన అనంతరం ఈ చాట్ బోట్ ద్వారా విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్న ఆయన.. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో కీలక మార్పులు తీసుకొచ్చారు.. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఏపీ విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకురావాలని కూడా గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.