భారత క్రికెట్ జట్టు, పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో 2025లో తన అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో పాటు, తన అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఒక పని చేశాడు. యువ క్రికెటర్ తన తల్లికి ప్రీమియం కారును బహుమతిగా ఇచ్చాడు. అర్ష్‌దీప్ తన తల్లికి టాటా కర్వ్ ఎస్యూవీ అనే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. తల్లిపట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ మరుపురాని క్షణాల వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు.
Also Read:Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్‌ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..
టాటా మోటార్స్ దీనిని మూడు ఇంజన్ ఎంపికలతో, రెండు పెట్రోల్ ఇంజన్, ఒక డీజిల్ ఇంజన్‌తో అందిస్తోంది. మొదటి ఆప్షన్ 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్, రెండవది 1.2-లీటర్ హైపెరియన్ పెట్రోల్ ఇంజన్, మూడవది 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజన్. టాటా కర్వ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు. దీని హైపెరియన్ ఇంజిన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షలు. దీని డీజిల్ ఇంజిన్ వేరియంట్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలు. కర్వ్ టాప్ వేరియంట్ ధర రూ. 7.69 లక్షలు, ఎక్స్-షోరూమ్.
Also Read:Kamareddy: అమెరికాలో కామారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి
భద్రత కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, i-TPMS, ట్రాక్షన్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీల కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ డీఫాగర్, ISOFIX చైల్డ్ యాంకరేజ్, ఇమ్మొబిలైజర్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, EPB, ABS, EBD, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు, 12.5 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, JBL, హర్మాన్ ఆడియో సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రెయిన్ సెన్సింగ్ వైపర్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.