ఓ రిటైర్డ్ ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. తన పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం తన ఖాతాలో జీతం నగదు జమ చేసింది. అది చూసిన ఆయన వెంటనే అధికారులను సంప్రదించి నగదు తిరిగి తీసుకోవాలని రాత పూర్వకంగా తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ లో పదవీ విరమణ చేసిన ఎస్ సీ కార్పోరేషన్ ఈడీ హన్మాండ్లుకు అధికారులు మే నెల వేతనం అకౌంట్లో వేశారు. ఏప్రిల్ లో ఉద్యోగ విరమణ చేస్తే జూన్ 1 న వేతనం రావడంపై ఆ రిటైర్డ్ ఉద్యోగి అవాక్కయ్యారు. కలెక్టర్ కు సమాచారం అందించారు. నేల వేతనం రూ. లక్షకు పైగా జమచేయడంతో తిరిగి నగదును తీసుకోవాలని అధికారులకు సూచించారు.
READ MORE: Constable Suicide: ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
హన్మాండ్లు ఏప్రిల్ నెలలో రిటైర్డ్ కాగా.. ఆ నెలకు సంబంధించిన వేతనం అప్పటికే చెల్లించారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వల్ల మళ్లీ జీతం తన సేవింగ్ ఖాతాలో జమచేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన ఖాతాలోని నగదును తీసుకొని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ని కోరారు. దీంతో పలువురు ఉద్యోగులు ఆయన నిజాయితీకి మెచ్చుకుంటున్నారు. అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ప్రస్తుత ఉద్యోగులకు సమయానికి జీతం చెల్లించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.