Arogyasri: తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి (సెప్టెంబర్ 16) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ వదిరాజు రాకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 323 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై డాక్టర్ వదిరాజు రాకేష్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల…