Himantha Biswa Sarma: రాహుల్.. సైన్యం పౌరులపై కాల్పులు జరపాలని సూచిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himantha Biswa Sarma: మణిపూర్‌లో భారత సైన్యం దేనినీ పరిష్కరించదు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు. ఇప్పుడు 100 రోజులకు పైగా కొనసాగుతున్న జాతి హింసకు పరిష్కారం బుల్లెట్ల నుంచి కాకుండా గుండెల నుంచి రావాలన్నారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో ఆర్మీ రెండు రోజుల్లో ఈ అల్లర్లను ఆపగలదని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించగా.. సైన్యం పౌరులపై కాల్పులు జరపాలని సూచిస్తున్నారా అని హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. “ఇండియన్ ఆర్మీ గతంలో మిజోరంలోని ఐజ్వాల్‌లో ఆ పని చేసింది. బాంబులు వేసిన తరువాత హింస తగ్గుముఖం పట్టింది. మణిపుర్లో హింసను భారత సైన్యమే ఆపాలని రాహుల్ అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? పౌరులపై కాల్పులు జరపాలా? అదే ఆయన ఉద్దేశమా? అలా ఎలా చెబుతారు? ఆర్మీ దేనినీ పరిష్కరించదు. తాత్కాలిక ప్రశాంతత మాత్రమే ప్రస్తుతానికి తీసుకురాగలదు. కానీ పరిష్కారం గుండె నుంచి రావాలి, బుల్లెట్ల నుండి కాదు.” అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
Read Also: Join My Wedding: పెళ్లి చేసుకోండి.. కోట్లు సంపాదించండి
Also Read
హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఈ అంశంపై మొదట ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని, ఆపై లోక్‌సభలో ప్రధాని మోదీ రెండు గంటలకు పైగా ప్రసంగం సందర్భంగా పార్లమెంటు నుండి వాకౌట్ చేయడం.. మణిపూర్‌కు సాయం చేయాలనే ఉద్దేశం విపక్షాలకు ఎంత మాత్రం లేదని తేలిపోయిందన్నారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడమే ప్రతిపక్షాల అజెండా అంటూ మండిపడ్డారు. మణిపుర్ రాష్ట్రం గురించి ప్రతి మాట ప్రధాని మనసుతో మాట్లాడారన్నారు. ఈశాన్యం గురించి ఆయన చూపిన చొరవ పట్ల సంతోషిస్తున్నామని హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.
గత నాలుగు నెలలుగా రాష్ట్రం మండిపోతున్నప్పుడు పార్లమెంటులో నవ్వడం, జోకులు పేల్చడం ప్రధానికి తగదని రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు.మణిపూర్‌ను కాల్చివేయాలని ప్రధాని కోరుకుంటున్నారని, దానిని కాల్చడానికి అనుమతిస్తున్నారని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాహు్ల్ గాంధీ ఆరోపించారు. హింసను ఆపాలని ప్రభుత్వం కోరుకుంటే, ప్రభుత్వం చేతిలో సాధనాలు ఉన్నాయని నొక్కి చెప్పారు.
VIDEO | "Solution has to come from the heart not from bullets," says Assam CM @himantabiswa on Congress leader Rahul Gandhi's 'Army can stop violence in Manipur' remark. pic.twitter.com/pY7JQ4KTxc
— Press Trust of India (@PTI_News) August 11, 2023
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!