Bihar Minister: నపుంసకుల సైన్యం.. అగ్నివీర్ పథకంపై బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Minister: బీహార్ కో-ఆపరేటివ్ మంత్రి, ఆర్జేడీ నేత సురేంద్ర యాదవ్ అగ్నివీర్ పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ పథకం “హిజ్రోంకా ఫౌజ్”(నపుంసకుల సైన్యం)గా మారుతుందని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘సరిగ్గా 8.5 ఏళ్ల తర్వాత అగ్నివీరుల సైన్యం నపుంసకుల సైన్యంగా మారుతుంది. నేను ఈ విషయం చెబుతున్నాను. 8.5 సంవత్సరాల తర్వాత, ప్రస్తుత ఆర్మీ మెన్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో అగ్నివీర్ల శిక్షణ కూడా పూర్తికాదు.” అన్నారాయన. “మన ఆర్మీ ప్రపంచంలోనే అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? 4.5 ఏళ్లలో ఎలాంటి ఆర్మీని సిద్ధం చేస్తారు?” అని ఆయన ప్రశ్నించారు. ఈ ఆలోచనను అందించిన వారిని ఉరితీయాలని బీహార్ సహకార మంత్రి సురేంద్ర యాదవ్ అన్నారు. ఆ ఆలోచన చేసిన వ్యక్తి అంతకంటే తక్కువ శిక్షకు అర్హుడు కాదన్నారు.
Read Also: Amritpal Singh: ఖలిస్తాన్ సెంటిమెంట్ అలాగే ఉంటుంది.. దీన్ని ఎవరూ అణచివేయలేరు..
Also Read
25-26 సంవత్సరాల వయస్సులో అగ్నివీర్‌గా పదవీ విరమణ చేసే వారిని ఎవరూ వివాహం చేసుకోరని ఆయన పేర్కొన్నారు. ఆ వయస్సులో రిటైర్డ్ సైనికుడిని అంటే వారిని ఎవరు వివాహం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతేడాది జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద 17న్నర ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసున్న యువకులను ఈ మూడు సర్వీసుల్లో నాలుగేళ్లపాటు 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగించాలనే నిబంధనతో నియమించుకుంటున్నారు. 2022 కోసం, గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలకు పొడిగించబడింది.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!