నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ డిఫరెంట్ రోల్స్ లో మెరుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తు్న్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ కు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read:AI Wonder: వైద్య రంగంలో అద్భుతం.. ఏఐ సాయంతో శిశువు జననం
తాజాగా చిత్ర యూనిట్ మరో అప్ డేట్ ఇచ్చింది. ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ ఏప్రిల్ 12న సాయంత్రం 7.59 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఏప్రిల్ 18, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.