నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ డిఫరెంట్ రోల్స్ లో మెరుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తు్న్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ కు విపరీతమైన బజ్…
తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ సినిమాగా మారిపోయింది. బాహుబలి నుండి తెలుగు సినిమాలను నిర్మించే విధానం, సినిమా స్టాండర్డ్స్ మొత్తం మారిపోయాయి. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ వంటి సంస్థలు రావడంతో నిర్మాతలకు వాటి రూపంలో ఆదాయం రావడం మొదలైంది. కోవిడ్ కారణంగా, చిన్న,పెద్ద అని తేడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసి ఓటీటీలకు సేల్ చేసి సొమ్ము చేసుకున్నారు. కానీ పోస్ట్ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. నేడు ఓటీటీ సంస్థలు…
మళయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయి వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ఒకటి. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం నమోదు చేసింది మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అయింది. 2006 లో కేరళలో కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్లగా అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపొందించబడింది మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం…
తెలుగు చలన చిత్ర చరిత్రలో పరుచూరి బ్రదర్స్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. రచయితలుగా, దర్శకులుగా, నటులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు కూడా ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తున్నాడు. వెంకటేశ్వరరావు తనయుడు రవీంద్రనాథ్ కొడుకైన సుదర్శన్ హీరోగా శనివారం ‘సిద్ధాపూర్ అగ్రహారం’ సినిమా మొదలైంది. వాసు తిరుమల, ఉష శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శ్రీపాద దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి. గోపాల్…
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు… హిందీలోనూ ‘రామ్ సేతు’ లాంటి చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ నెల 17న అతను నటించిన ‘గాడ్సే’ మూవీ విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే సరిగ్గా దానికి ఒక నెలలోనే సత్యదేవ్ మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ రాబోతోంది. ఈ సినిమాను జూలై 15న విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు గురువారం తెలిపారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’ కు ఇది రీమేక్.…