Argentina Alive After Death: ఖతం మనోడి పని అయిపోయింది.. ఇక అంత్యక్రియలు చేద్దామని చూస్తుండగా వచ్చాడు.. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు.. నేను బతికే ఉన్నా అని చనిపోయిన వ్యక్తి వచ్చి చెప్తే.. ముందు అందరూ అనుకునేది.. నిజంగా మనోడు మనిషా.. దయ్యమా.. అనేది. కానీ వచ్చిన వ్యక్తి చనిపోయాడని అనుకున్న వ్యక్తే. మరి చనిపోయాడని అనుకొని అంత్యక్రియలు జరిపించడానికి నిర్ణయం తీసుకున్నారంటే శవం ఉంటుంది కదా.. ఆ శవం ఎవరిది.. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది..
ఎక్కడ జరిగిందంటే..
అర్జెంటీనా ఈ వింత సంఘటనకు కేంద్రం అయ్యింది. అర్జెంటీనాలో 22 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు, ఆయన కుటుంబ సభ్యులు తన అంత్యక్రియలు చేయడానికి సిద్ధం అవుతుండగా, సరిగ్గా ఆ సమయానికి చనిపోయాడని అనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చాడు. మొదట ఆ కుటుంబ సభ్యులకు కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యింది. కానీ తర్వాత ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇక మనోడు బతికే ఉన్నాడు కాబట్టి, కుటుంబ సభ్యులు, ప్రజలు శవపేటికలో ఎవరు ఉన్నారా అని ఆశ్చర్యంగా దాని వైపు చూశారు.
ఇంతకీ శవ పేటికలో ఎవరున్నారు?
ఈ సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. చనిపోయాడని అనుకున్న వ్యక్తి నిజంగా బతికే ఉండి ఉంటే, శవ పేటికలో ఎవరున్నారు? ఈ గందరగోళం సెప్టెంబర్ 18న మొదలైంది. ఆ రోజు చెరకుతో నిండిన ట్రక్కు ఢీకొని ఒక యువకుడు మరణించడంతో కథ మొదలైంది. విషయం కోర్టుకు చేరి, ప్రాసిక్యూటర్లు ఈ కేసును నిర్లక్ష్యంగా జరిగిన హత్యగా వాదించడంతో, కోర్టు శవపరీక్షకు ఆదేశించింది. మరుసటి రోజు మృతుడి తల్లినని చెప్పుకుంటూ ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వచ్చిన మహిళ మృతుడిని అతని దుస్తులు, కొన్ని శారీరక లక్షణాలను బట్టి గుర్తించినట్లు సమాచారం. దీంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగా, ఆ మహిళ నిజమైన కుమారుడు వచ్చి తాను చనిపోలేదని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చాడు. చనిపోయాడని అనుకున్న వ్యక్తి బతికి రావడంతో కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు.
పలు నివేదికల ప్రకారం.. ఆ మహిళ కొడుకు అర్జెంటీనాలోని కార్డోబాకు ఉత్తరాన ఉన్న అల్డెరెటెస్కు చాలా రోజుల క్రితం మద్యం తాగడనికి వెళ్లినట్లు తెలిసింది. తర్వాత ఆయన ఇక ఇంటికి రావడం జరగలేదు. వాస్తవానికి మనోడికి తన సొంత ఊళ్లో ఏం జరుగుతుంది, తన ఇంట్లో ఏమి జరుగుతుందో కూడా తెలియదు. ఈ ఘటన వెలుగు చూసిన అనంతరం ఆ వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ విచారించారు. వచ్చిన వ్యక్తి నిజమైన వాడని నిర్థారించడాని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మార్చురీకి తరలించి శవపరీక్ష చేయించారు. చనిపోయిన వ్యక్తి డెల్ఫిన్ గాల్లో పట్టణానికి చెందిన 28 ఏళ్ల మాక్సిమిలియానో ఎన్రిక్ అకోస్టా అని వెల్లడైంది.
అంతా తప్పుతప్పుగా..
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మాక్సిమిలియానో మృతదేహాన్ని తిరిగి వారి కుటుంబానికి అప్పగించారు. సెప్టెంబర్ 23 మంగళవారం మృతుడి స్వస్థలంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడ మరొక పరిపాలనా లోపం కనిపించింది. మాక్సిమిలియానో కుటుంబానికి ఆయన చనిపోయారని సమాచారం అందినప్పుడు, వారికి వేరే మృతదేహాన్ని చూపించినట్లు సమాచారం. “మొదటి నుండి అంతా తప్పుగా ఉంది,” మృతుడి సోదరుడు హెర్నాన్ కోపం వ్యక్తం చేశారు. “మొదట అధికారులు సరైన గుర్తింపు లేకుండా మృతదేహాన్ని అప్పగించారు. తరువాత వారు నన్ను రెండుసార్లు మార్చురీకి పంపారు.” ఈ తప్పులు ఎలా జరిగాయో తెలుసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
READ ALSO: FBI ABSCAM 1980: ఎఫ్‌బీఐ ఉచ్చులో కాసులకు కక్కురుత్తిపడిన అమెరికన్‌లు.. కథ మామూలుగా లేదు!