భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లో 320 సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు కనీసం 65% మార్కులతో లేదా CGPA 6.84/10 తో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో BE/ B.Tech లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. జూన్ 16, 2025 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను పే మ్యాట్రిక్స్ లెవల్ 10 కింద సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’గా నియమిస్తారు.
Also Read:Glenn Maxwell: గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం!
ప్రారంభ వేతనం నెలకు రూ. 56,100 అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250 చెల్లించాలి. దరఖాస్తు సమయంలో రూ.750 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన మహిళలు, SC/ST, PwBD, మాజీ సైనికులకు పూర్తి వాపసు (రూ. 750), పరీక్షకు హాజరయ్యే ఇతర అభ్యర్థులకు పాక్షిక వాపసు (రూ. 500) రీఫండ్ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 16 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.