బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 60% (లేదా తత్సమానం) మార్కులతో BE/B.Tech (CS/IT/ECE), MCA, లేదా M.Sc ఉత్తీర్ణులై ఉండాలి. ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, LLB కలిగి ఉండాలి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి 25 నుంచి 45 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read:Smriti Mandhana Haldi: స్మృతి మంధాన ఇంట్లో పెళ్లి బాజాలు.. మొదలైన హల్దీ సెలబ్రేషన్స్
రాత పరీక్షలో ఇంగ్లీష్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 125 మార్కులకు. పరీక్ష వ్యవధి 100 నిమిషాలు. అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి గ్రేడ్ స్కేల్-II నెలకు రూ. 64,820 నుండి రూ. 93,960, గ్రేడ్ స్కేల్-III నెలకు రూ. 85,920 నుండి రూ. 1,05,280, గ్రేడ్ స్కేల్-IV నెలకు రూ. 1,02,300 నుండి రూ. 1,20,940 జీతం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు SC/ST, వికలాంగ అభ్యర్థులకు రూ. 175, ఇతర అభ్యర్థులకు రూ.850గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.