ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 కొత్త సీరిస్ అతి త్వరలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కొత్త తరహా ఫీచర్లను తీసుకురానుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లో బటన్ లేకుండా సెన్సార్ లాగా ఉంటుందనే వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో కొత్త లైవ్ బటన్లు రానున్నాయి. ఈ కొత్త బటన్ల వల్ల మనం అనేక పనులు ఒకేసారి చేయొచ్చు. యాపిల్ వాచ్ అల్ట్రాలో ఇలాంటి యాక్షన్ బటన్ ను మనం చూడొచ్చు. ఉదహరణకు.. ఆ బటన్ తో మనం స్టాప్ వాచ్, వర్కౌట్, బ్యాక్ ట్రాక్ తదితర ఆప్షన్లు సెలక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు వాటితోనూ ఫోన్ టర్నాఫ్ చేయొచ్చు.
Also Read : Covid-19 Cases: దేశంలో కరోనా టెర్రర్.. 24 గంటల్లో 9,629 కేసులు, 29 మరణాలు
ఈ కొత్త తరహా స్మార్ట్ ఫోన్ లో కెమెరాను వాడేందుకు కూడా ఈ బటన్ ఉపయోగించొచ్చు. వీటిని సున్నితంగా నొక్కడం ద్వారా ఫోటోలను తీయొచ్చు. అంతేకాదు ఆటో ఫోకస్ చేయుచ్చు. వాటిని నొక్కడం, పట్టుకోవడం ద్వారా మనం వీడియోను రికార్డ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. యాపిల్ ఐఫోన్ 15 3nm ప్రాసెస్ టెక్నాలజీ ఆధారంగా కొత్త A17 బయోనిక్ చిప్ ను కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 15 ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్స్ A17 బయోనిక్ SOCని కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ లో బెండ్ అయిన బెజెల్స్, స్టెయిన్ లెస్ స్టీల్ కు బదులుగా టైటానియం ఫ్రేమ్ మరియు డైరెక్ట్ బటన్ లకు బదులుగా హాస్టిక్ సెన్సార్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. అన్ని ఫోన్ మోడల్స్ ఇప్పటికే ఉన్న లైట్నింగ్ పోర్ట్ కు బదులుగా USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ను కలిగి ఉండటం కీలకమైన అంశం. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. అయితే భారతదేశం కరెన్సీ ప్రకారం కచ్చితంగా లక్షన్నర రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : RK Beach : ఆర్కేబీచ్లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం