Bengaluru: బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు.. షాకైన ప్రజలు
- బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు
- సీసీటీవీలో రికార్డైన దొంగతనం దృశ్యాలు
- తాజా ఘటనతో షాకైన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు చోరీలు. దోపిడీలు ఖరీదైన వాటి కోసమో.. లేదంటే ఆభరణాల కోసమో, డబ్బు కోసం జరుగుతాయని వార్తల్లో.. టీవీల్లో చూశాం. కానీ ఇప్పుడు దొంగతనాలు కొత్త రూపం దాల్చాయి. తాజాగా దొంగల కన్ను వంటింటిపై పడింది. ఇందుకు టెక్ సిటీ బెంగళూరులో జరిగిన సంఘటనే ఉదాహరణ.
గత మూడు వారాలుగా పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. దీంతో గ్యాస్, చమురు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపేసింది. దీంతో గృహ వినియోగదారులు భయాందోళనలతో సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఈ ఆందోళనల నేపథ్యంలో తాజాగా బెంగళూరులో దొంగల ముఠా ఓ ఇంటిపై పడింది. ఆభరణాలు, నగదు కాకుండా ఏకంగా వంటింటిలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిపోయారు. చోరీకి చెందిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉగాది పండుగ రోజే ఈ దొంగతనం జరగడం విశేషం.
సీసీటీవీ వీడియోలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై బేగూర్ నివాసానికి వస్తున్నట్లు కనిపించింది. హెల్మెట్లు ధరించడంతో ముఖాలు కనిపించలేదు. ఒకరు స్కూటర్‌పై ఇంట్లోకి ప్రవేశించగా.. మరొకరు బయట రోడ్డుపైనే ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకడు స్కూటర్‌పై రెండు సిలిండర్లతో లోపలి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం ఇద్దరూ స్కూటర్‌పై పరారయ్యారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
తాజావార్తలు
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!