భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది.
Apache Helicopter: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ ఈరోజు మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపరాల్‌లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.