Gold and Silver Price Today in Hyderabad on 28th November 2023: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ పెరగడమే తప్ప.. తగ్గడం లేదన్నట్లుగా దూసుకుపోతున్నాయి. నిన్న స్థిరంగా బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,560గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 270 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,710గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,560గా కొనసాగుతోంది.
మరోవైపు నేడు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 78,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1300 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,500లు ఉండగా.. చెన్నైలో రూ. 81,500గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,250గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 81,500లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 81,500గా కొనసాగుతోంది.