రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పింది. రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: Satya Kumar Yadav: ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే నా ఆకాంక్ష!
మరోవైపు తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.