Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warren Buffett: ప్రపంచ స్టాక్ మార్కెట్లను శాసించిన పెట్టుబడుల పితామహుడు, ఇన్వెస్ట్మెంట్ రంగంలో రికార్డులను తిరగరాసిన దిగ్గజం వారెన్ బఫెట్ అనూహ్య నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య వర్గాలను షాక్‌కు గురిచేశారు. దశాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మదుపర్లకు దిక్సూచిగా నిలిచిన ఆయన, తన సొంత సామ్రాజ్యం బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు సంస్థ శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది.
తండ్రి స్థానంలో కొడుకు..
వారెన్ బఫెట్ తప్పుకోవడంతో ఆ ప్రతిష్టాత్మక పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారనే ఉత్కంఠకు కంపెనీ తెరదించింది. బెర్క్‌షైర్ హాత్వే రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, వారెన్ బఫెట్ కుమారుడు హోవార్డ్ బఫెట్ సంస్థ నూతన ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. 1993 నుంచే డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ కంపెనీ వ్యవహారాలను ఔపోసన పట్టిన హోవార్డ్, కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా ప్రపంచ ఆకలి కేకలను తీర్చే ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా, సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఇప్పుడు తండ్రి వదిలిన అతిపెద్ద బాధ్యతను మోసేందుకు సిద్ధమయ్యారు.
Also Read
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
బఫెట్ పాత్ర ఇకపై ఎలా ఉండబోతోందంటే
ఛైర్మన్ హోదాకు రాజీనామా చేసినంత మాత్రాన బఫెట్ కంపెనీకి పూర్తిగా గుడ్‌బై చెప్పేయలేదు. ఇకపై ఆయన ‘ఛైర్మన్ ఎమెరిటస్’గా డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతారు. తన అపారమైన అనుభవం, సలహాలతో సంస్థకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు. మరోవైపు సంస్థ రోజువారీ కార్యకలాపాలు ఎప్పటిలాగే సీఈఓ గ్రెగ్ ఏబెల్ సారథ్యంలోనే కొనసాగుతాయని, స్వతంత్ర డైరెక్టర్ సుసాన్ డెక్కర్ కూడా తన విధులను నిర్వర్తిస్తారని కంపెనీ స్పష్టం చేసింది.
అమెరికన్ కార్పొరేట్ చరిత్రలోనే తిరుగులేని అధ్యాయం
వారెన్ బఫెట్ నిర్ణయంపై సీఈఓ గ్రెగ్ ఏబెల్ స్పందిస్తూ.. అమెరికన్ కార్పొరేట్ చరిత్రలో బఫెట్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని కొనియాడారు. కేవలం లాభాలే పరమావధిగా కాకుండా, ఆయన నిర్మించిన విలువలు, నమ్మకమే బెర్క్‌షైర్ హాత్వేను నేడు ఈ స్థాయికి చేర్చాయని తెలిపారు. ఆ సిద్ధాంతాలను, విలువలను కాపాడే బాధ్యతను ఇకపై హోవార్డ్ బఫెట్ ముందుకు తీసుకెళ్లనున్నారు. ఏది ఏమైనా, ప్రపంచ పెట్టుబడిదారులకు నిన్నటిదాకా ఒక శకంగా నిలిచిన వారెన్ బఫెట్ ప్రత్యక్ష నాయకత్వ పర్వానికి తెరపడటం మాత్రం గ్లోబల్ బిజినెస్ హిస్టరీలోనే ఒక కీలక మలుపు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!