PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- నిరుద్యోగులకు శుభవార్త
- ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- ఒకేసారి రేపు 51 వేల మందికి అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం ప్రధాని మోడీకి చెందిన కీలక కార్యక్రమం జరగనుంది. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు అందించనుంది. 20వ రోజ్‌గార్ మేళాలో భాగంగా 51 వేల మందికి పైగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. సెప్టెంబర్ 19న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది.
సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటలకు రోజ్‌గార్ మేళా ప్రారంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని.. ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 45 ప్రాంతాల్లో ఈ రోజ్‌గార్ మేళా నిర్వహించనున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ఏయే శాఖల్లో ఉద్యోగాలు?
అపాయింట్మెంట్ లెటర్లు అందుకోనున్న అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో విధుల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉన్నాయి.
యువతకు ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, దేశ అభివృద్ధి ప్రక్రియలో వారిని మరింత భాగస్వాములను చేయడమే రోజ్‌గార్ మేళా లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 20వ రోజ్‌గార్ మేళా పూర్తయ్యే నాటికి ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న యువత సంఖ్య సుమారు 12.75 లక్షలకు చేరుతుందని ప్రభుత్వం తెలిపింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో వీరికి నియామకాలు కల్పించినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!