NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజునే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందింది. ఈ ఐపీఓ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 100 శాతానికి పైగా భర్తీ అయింది. ప్రస్తుతం ఈ ఐపీఓ మొత్తం 2.04 రెట్లు పైగా సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ కోటా కూడా పూర్తిగా నిండిపోయింది. దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు గడువు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది.
ఈ ఐపీఓలో రిటైల్ కేటగిరీ 1.07 రెట్లు, క్యూఐబీ (QIB) కోటా 3.70 రెట్లు, ఎన్ఐఐ (NII) కోటా 2.07 రెట్ల చొప్పున సబ్స్క్రిప్షన్ సాధించాయి. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 21 వరకు బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 16నే ఈ ఇష్యూను తెరిచి, ఆ ద్వారా రూ. 6,746.18 కోట్లను సమీకరించింది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించడానికి (IPO) ముందు, ఆ షేర్లకు అనధికారికంగా జరిగే కొనుగోలు, అమ్మకాల మార్కెట్‌ను గ్రే మార్కెట్ అంటారు. ప్రస్తుతం దీనికి గ్రే మార్కెట్లో క్షీణత కనిపిస్తుంటంతో ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒక దశలో ఈ ఐపీఓ రూ. 310 వరకు పలికింది. అయితే ప్రైస్ బ్యాండ్ వెల్లడైన తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. నివేదికల ప్రకారం గురువారం రూ. 142 వద్ద ఉన్న గ్రే మార్కెట్ ప్రైస్, ప్రస్తుతం రూ. 105కి పడిపోయింది.
ఇక ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,700 నుంచి రూ. 1,785 మధ్య కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్లో 8 షేర్లు ఉండటంతో, ఇన్వెస్టర్లు కనీసం రూ. 14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రతి షేరుపై రూ. 170 రాయితీని ప్రకటించారు. ఈ ఐపీఓ మొత్తం పరిమాణం రూ. 22,561.57 కోట్లుగా ఉంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద వస్తుండగా.. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 12.64 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఈ ఇష్యూ సైజు రూ. 30,000 కోట్లుగా ఉండగా.. దానిని సవరించారు. సోమవారం వరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి తుది ఫలితాలపై మరింత స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!