ఈ మధ్య సస్పెన్స్ కథలతో వస్తున్నా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాలు ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి.. భారీ వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇప్పుడు మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కథ వెనుక కథ మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతుంది..
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి 28 న స్ట్రీమింగ్ కాబోతుంది. కథ వెనుక కథ సినిమా గత ఏడాది మే 12న థియేటర్లలో విడుదలైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో శ్రీజీత ఘోష్ హీరోయిన్‌గా నటించింది. శుభశ్రీ, జయప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు.. అయితే కథ కొత్తగా లేకపోవడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..
ఇప్పుడు ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే యువకుడిగా విశ్వాంత్ నటించాడు. సునీల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.. ఆ యువకుడు రాసుకున్న కథలో ఎలాగైతే అమ్మాయిలు మిస్ అవుతారో, రియల్ లైఫ్ లో కూడా అలాగే మిస్ అవుతారు. హత్యలకు గురవుతారు.. ఆ మిస్టరీని సునీల్ ఎలా చేదిస్తాడు.. అసలు అమ్మాయిలను హత్య చేస్తున్నది ఎవరో కనిపెట్టడం కథ.. అక్కడ మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..