ఏపీలో బలహీనవర్గాలకు ముందునుంచీ అండదండలు ఇచ్చింది టీడీపీయే అన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రతి ఒక్కరు నడుంబిగిద్దాం.. మన హక్కులను కాపాడుకుందాం..తెలుగుదేశం 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది..బలహీన వర్గాలకు వివిధ పధకాలు టిడిపి హయాంలోనే తీసుకువచ్చాం.ఆంద్రప్రదేశ్ లో ఇంకా కొన్ని కులాలు వెనుకబడే ఉన్నాయి..దేశ… రాష్ట్ర జనాభాలో అత్యధికులు బి.సి.లే..అయితే మనలో ఐకమత్యం లేదు. అందుకే ఎదగలేకపోతున్నాం..రాజకీయ పార్టీలు వేరైనా మనుషులు వేరైనా..అందరూ కలిసికట్టుగా ఉండాలి..తెలుగుదేశం పార్టీ అధికారం..లో ప్రతిపక్షంలో ఉన్నా ఐకమత్యంతో ఉంది..ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుది ఒకే నినాదం బలహీన వర్గాలు ఎదగాలన్నారు అచ్చెన్నాయుడు.
Read Also: Lord Of The Drinks: లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రియాంక్ సుఖిజా
ఈరోజుకి మనం కులవృత్తుల మీదనే బతుకుతున్నాం..జగన్ మోహన్ రెడ్డికి బలహీన వర్గాలంటే కోపం..ఎందుకంటే బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉంటారనీ..నాలుగు సంవత్సరాలలో 54 కార్పోరేషన్లు ఇచ్చారంటారు..ఒక్కపైసా కూడ నిధులివ్వలేదు..ఈ ప్రభుత్వంపై బలహీన వర్గాల తరపున మాట్లాడితే మా మీద కేసులు, అరెస్టులు..బలహీన వర్గాలకు చట్టసభల్లో అవకాశం ఇచ్చేందుకు కృషిచేస్తాం..మీ అందరి సలహాలు తీసుకుని మ్యానిఫేస్టోలో పెట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు.
Read Also: MLA Sudhakar babu: జగన్ పై రాజకీయకుట్ర జరుగుతోంది