మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నా అని, తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించాను అని స్పీకర్ తెలిపారు. బుధవారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నెంబర్ గేటును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ఓపెన్ చేయించారు. గత ప్రభుత్వం గేట్-2 మూసేసి నిర్మించిన గోడను పడగొట్టించి గేట్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెట్టించారు. రైతుల కష్టాలు వినపడకూడదని ఒక నియంత కట్టుకున్న అడ్డుగోడను తొలగించామని ఆయన అన్నారు.
AyyannaPatrudu: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో 80 మంది వరకు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. వీరందరూ సభా మర్యాదలు ఎలా పాటించాలన్న దానిపై తరగతులు నిర్వహిస్తాం.. అసెంబ్లీలో సీనియర్ నాయకుల సభలో మాట్లాడిన స్పీచులు ఉన్నాయి.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ ఈఓ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేడు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని ఆయన వ్యాఖ్యలు చేశారు.