స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జైళ్లశాఖ డీజీ వెల్లడించారు. స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామన్నారు. కేవలం చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీ ఇస్తున్నామని డీజీ చెప్పుకొచ్చారు.