CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CCTV Cameras Offline: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 సీసీ కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిణామాల రికార్డింగ్, పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆన్లైన్లో భద్రపరిస్తే వాటిని ఎడిట్ చేసే అవకాశం ఉండదని, అదే ఆఫ్‌లైన్‌లో రికార్డయితే ఫుటేజీని ఎడిట్ చేసే వెసులుబాటు ఉంటుందనే ఆరోణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పులివెందుల మండలంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మండల పరిధిలో మొత్తం 19 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. వాటిలో కేవలం ఐదు మాత్రమే ఆన్లైన్లో పనిచేస్తున్నట్లు సమాచారం. మిగిలిన 14 కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల రికార్డింగ్ సక్రమంగా పనిచేయడం కీలకం. ఆఫ్‌లైన్‌లో ఉన్న కెమెరాల ఫుటేజీ కూడా భద్రంగా స్టోర్ అవుతోందా?.. దాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు?.. రికార్డింగ్‌ను ఎవరైనా మార్చే అవకాశం ఉందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Also Read
- Ramayana Review: రామాయణ మూవీ రివ్యూ..
- Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
- Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్!
-
Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
-
Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
-
Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!