ఏపీలో ఈ నెల 13వ తేదీన టీచర్, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ జరగనుంది. అటు టీడీపీ, ఇటు అధికార వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తాజాగా తిరుపతిలో దొంగ ఓట్లు నమోదయ్యాయని విపక్షాలు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి. తిరుపతిలో దొంగఓట్లు కలకలం రేపుతున్నాయి. అర్హత లేని వేలాదిమందికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క తిరుపతిలోనే ఏడు వేల దొంగ ఓట్లు ఉన్నాయి అంటున్నారు టీడీపీ నేతలు. డిగ్రీ అర్హత లేకుండా ఓటర్లుగా నమోదై లిస్టులో ఉన్న వారిపై దృష్టి సారించాయి వామపక్షాలు.
Read Also: Russia-Ukraine War: బఖ్‌ముత్ రష్యా సొంతం అయితే అంతే సంగతులు.. జెలన్ స్కీ భయం..
తిరుపతి నగరంలోని అధికార వైసిపి కార్యాలయం చిరునామా పేరుతో 20 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తుంది సిపిఎం. ఓటర్లుగా ఉన్న వాళ్ళ ఇళ్లకు వెళ్లి విచారిస్తున్పారు వామపక్ష నేతలు.. చదువు రాని వారు, పదవ తరగతి కూడా పూర్తి చేయని వారికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కల్పించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. డిగ్రీ పత్రాల జిరాక్స్ లో పేర్లు మార్చి ఓటర్లుగా నమోదైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగ ఓట్ల విషయంలో అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు. ఈసీ దీనిపై దృష్టిపెట్టాలని కోరుతున్నాయి.
Read Also:Bank SMS Fraud: ఫేక్ మెసేజ్ ల వల.. 3 రోజుల్లోనే 40 మంది కస్టమర్ల అకౌంట్లు హాంఫట్
