KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో బూత్‌లో 50 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్లు అనుమానం ఉందని తెలిపారు. ఈ సమాచారం ఆయన సొంత దృష్టికి వచ్చినట్టు, నియోజకవర్గంలో తీవ్రమైన ఎన్నికల అవినీతి పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గత ఎన్నికల్లో కొన్ని కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు కార్తీక్, దీపక్ శర్మ, మాధురి…
ఎన్నికల సంఘంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. ఇటీవల ఇండియా కూటమికి విందు ఇచ్చిన సందర్భంగా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు.
ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ని కలిసి కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని…
ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేరుగా పోటీ చేయలేదని ఆయన గుర్తుచేశారు. వైయస్, చంద్రబాబు కూడా అభ్యర్థులను నిలపలేదన్నారు. జగన్ అభ్యర్థులను నిలపడమే కాకుండా అక్రమ మార్గాల్లో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చారని చెప్పారు. 15 వేల ఓట్లు తిరుపతిలోనే ఎక్కించారని తెలిపారు. ఎక్కడ దొంగ ఓట్లు…