Minister RK Roja: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నేను అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. సీనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు రజినీకాంత్.. ఇక, టీడీపీ చీఫ్ చంద్రబాబు పరిపాలనపైనా ప్రశంసలు కురిపించారు. అయితే, రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు చేశారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారు. ఎన్టీఆర్ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తాను. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుంది. ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్ మాట్లాడారంటూ దుయ్యబట్టిన విషయం విదితమే.. దీంతో, రజనీకాంత్ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారిపోయారు మంత్రి రోజా.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రజనీకాంత్ వాఖ్యలపై తాను విమర్శలు చేయలేదు.. ఖండిచాను అని వివరణ ఇచ్చారు.
Read Also: Cow Attacks Old man: పగబట్టినట్టు వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఆవు.. వీడియో వైరల్
Also Read
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
రజనీకాంత్ ఎవరినో ఉద్దేశించి చేసిన వాఖ్యలను మాకు అపాదిస్తూ సోషయల్ మీడియాలో ట్రోల్ చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ఇక, లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో మోరుగుతున్నాడు.. పవన్ కల్యాణ్ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ఫ్యాకేజిని తీసుకోని విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు. మరోవైపు.. అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రహ్మిణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారు.. చంద్రబాబు, లోకేష్ ని విచారించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. టీడీపీ కొత్త పాలకమండలిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కేసులు పెట్టగానే నేరచరిత్రులు కారు.. వారిని పాలకమండలిలో నియమిస్తే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!