Cow Attacks Old man: పగబట్టినట్టు వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఆవు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cow Attacks Old man in Punjab: ప్రస్తుతం మనుషుల ప్రాణాలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసి నడిరోడ్డుపై నరక్కుంటున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఈ మధ్య అడవిని వదిలి క్రూర జంతువులైనా పులి, సింహాలు కూడా జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. సరే అవి క్రూరజంతువులు దాడి చేయడం వాటి స్వభావం అనుకుంటే ఆఖరి వీధి కుక్కలు కూడా మనుషుల మీద దాడి చేసి చంపేస్తన్నాయి. హైదరాబాద్ లోనే వీధి కుక్కల దాడిలో ఎంతో మంది మరణించారు. అవి ఎంతో మంది మీద దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కుక్కలు మాత్రమే కాకుండా సాధు జంతువులైన ఆవులు కూడా దారణంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. వారిపై దాడి చేసి ప్రాణాలు సైతం తీస్తున్నాయి. ఓ బాలికపై ఆవు దాడి చేసిన వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా కూడా ఆవు ఓ వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
Also Read: Cheetah-Tortoise Food: చిరుతతో ఫుడ్ పంచుకున్న తాబేలు.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో
ఈ దారుణ ఘటన పంజాబ్ లో జరిగింది. మొహాలీలోని పన్‌లో ఓ ఆవు సరూప్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. 83 ఏళ్ల సరూప్ సింగ్ దానిని బయటకు పంపడానికి ప్రయత్నించాడు. దాంతో ఆవుకు కోపం వచ్చి ఆయనపైనే తిరగబడి దాడి చేసింది. ఆయనను రోడ్డుపై 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి చంపేసింది. ఆవు నుంచి తప్పించుకోవడానికి ఆ వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పెద్దాయనను ఆవు ఈడ్చుకెళుతున్నప్పుడు కొంత మంది దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయిన ఆవు ఆగలేదు. ఏదో పగ ఉన్నట్లే వృద్ధుడి ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు. సాధు జీవి అయిన ఆవు కూడా ఇలా చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
Elderly man dies after stray cow drags him for about 100 meters, collides with several vehicles in Punjab’s Mohali.
The deceased was identified as 83-year-old Saroop Singh.#Punjab #Mohali pic.twitter.com/kCuRcpDAMM
— Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2023
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!