మైనర్ బాలిక పట్ల జనసేన నేత రాఘవరావు వేధింపులపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. విశాఖ పోలీస్ కమిషనరుకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని విశాఖ పోలీస్ కమిషనరును అదేశించారు మహిళా కమిషన్ చైర్ పర్సర్ వాసిరెడ్డి పద్మ. బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకుడు రాఘవరావు వేధింపుల పర్వంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: NTR: సముద్ర వీరుడి లుక్ కోసం యంగ్ టైగర్ రెడీ అవుతున్నాడా…
విశాఖ నగర సోలీస్ కమిషనర్ శ్రీకాంత్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న చైర్మ పర్సన్ వాసిరెడ్డి పద్మ విశాఖ నగరానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల జనసేన నేత రాఘవరావు వేధింపులపై కఠిన చర్యలు చేపట్టాలని అదేశించారు… బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూటు భరోసా ఇచ్చారు. అయితే జనసేన నేత రాఘవరావు పలుకుబడి కారణంగా తమకు హాని కలుగుతుందనే భయంతో బాలిక కుటుంబికులు ఉన్నారని వారి రక్షణ కల్పించాలన్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో అర్ధరాత్రి ఇంటికి వెళ్లి సుత్తితో తల్లి, ఇద్దరు కూతుర్లపై దాడి ఘటన, విశాఖ రాఘవరావు సంఘటనలపై జనసేన అధ్యక్షలు పవన్ కల్యాణ్ స్పందించాలన్నారు.
Read Also:Massive Accident: దట్టంగా అలుముకున్న పొగమంచు.. హైవేపై ఢీకొన్న 200కార్లు