Massive Accident: చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ నగరం జెంగ్జూలోని ఓ హైవేపై భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ రోడ్డుపై వాహనాలు ఒకదాన్ని ఒకటి చొప్పున ఏకంగా భారీ సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. ఆ ఘటనలో దాదాపు 200 కార్లు ధ్వంసం అయ్యాయి. బుధవారం ఉదయం చాలా పొగమంచు కారణంగా హెనాన్ ప్రావిన్స్‌లోని సెంట్రల్ చైనీస్ సిటీ జెంగ్‌జౌలో వంతెనపై డజన్ల కొద్దీ వాహనాలు ఢీకొన్నాయని అక్కడ మీడియా వెలువరించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు.
Read Also: KCR Condoles Harinatha Rao : మంత్రి కేటీఆర్ మామకు నివాళులర్పించిన కేసీఆర్
అనేక కార్లు, ట్రక్కులు ఒకదానిపై ఒకటి కుప్పలుగా పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యెల్లో రివర్ జెంగ్జూ హువాంగ్ వంతెనపై ప్రమాదం జరిగింది. అతి పొడుగైన మల్టీలేన్ బ్రిడ్జ్ భయానకంగా తయారైంది. కార్లు, కార్గో ట్రక్కులు, లారీలు, ఇతర వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. డ్రైవర్లు, ప్యాసింజెర్లు తమ కార్లలోనే చిక్కుకుపోయారు. అనేక కిలోమీటర్ల దూరం మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక రోడ్డు మీద ఉన్న మంచు తడి వల్ల వాహనాలు జారిపోయి ఢీకొన్నట్లు తెలుస్తోంది.
25 days till chinese New Year. Zhengxin Yellow River Bridge in ☭#china's Zhengzhou (home of deadly man-made floods in 2021 killing 10k & recent Foxconn "Great Escape"), more than 400 vehicles collided in a row due to reckless drivers, heavy fog & black ice on the road. pic.twitter.com/P9DNZRg1XT
— Northrop Gundam 💎∀🦅⚔️☭⃠ (@GundamNorthrop) December 28, 2022