యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కోసం తారక్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేదు, త్వరగా ఎదో ఒక అప్డేట్ చెప్పండి అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ లో ఉన్న ఎన్టీఆర్, జనవరి ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ తిరిగి రాగానే ‘ఎన్టీఆర్ 30’ పూజా కార్యక్రమాలు పూర్తి చెయ్యాలనేది కొరటాల శివ ఆలోచన. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో సినిమాని షూట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫుల్ స్వింగ్ లో ‘ఎన్టీఆర్ 30’ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
Read Also: NTR: జనవరి 5న హైదరాబాద్ తిరిగి రానున్న తారక్… 22న ‘ఎన్టీఆర్ 30’ పూజ
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో తాను చెయ్యబోయే సినిమా నెక్స్ట్ లెవల్ ఎమోషన్స్ తో ఉంటుందని, ఒక కొత్త యూనివర్స్ ని చూపించబోతున్నామని కొరటాల శివ గతంలో చెప్పాడు. ఈ కొత్త యూనివర్స్ అనే మాటని నిజం చేస్తూ ‘సముద్రం బ్యాక్ డ్రాప్’లో ‘ఎన్టీఆర్ 30’ రూపొందనుందని సమాచారం. మోషన్ పోస్టర్ లోనే సముద్రాన్ని ఎస్టాబ్లిష్ చేసిన కొరటాల శివ, అనౌన్స్మెంట్ వీడియోలో ఎన్టీఆర్ తో కత్తి పట్టించాడు. ఈ సముద్ర వీరుడి గెటప్ కోసమే ఎన్టీఆర్ వెయిట్ గైన్ అవుతున్నట్లు ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ నుంచి బయటకి వస్తున్న ఫోటోస్ చూస్తుంటే ఆ విషయం అర్ధమవుతోంది. ముఖ్యంగా రీసెంట్ గా బయటకి వచ్చిన ఒక ఫోటోలో ఎన్టీఆర్ ఫుల్ గడ్డంతో పూర్తిగా రగ్గడ్ లుక్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ బియర్డ్ లుక్ లోనే ఫైనల్ చేంజస్ చేయనున్నారట. టెంపర్ నుంచి సినిమా సినిమాకి లుక్ విషయంలో వేరియేషన్స్ చూపిస్తున్న ఎన్టీఆర్, కొరటాల శివతో చెయ్యనున్న సినిమాలో ఎలాంటి కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు అనే విషయంలో ఫిబ్రవరిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: NTR: ఈ ఏడాది బెస్ట్ ఎలివేషన్ సీన్ అంటే ఇదే..