ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇదివరకే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వలేదు. 75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారు. వీటికి సంబంధించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది.…
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతిరోజూ పేపర్ లీక్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి పేపర్ లీక్‌లు కాదని మాస్ కాపీయింగ్ జరుగుతోందని విద్యాశాఖ వివరణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేలా చర్యలు చేపట్టింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్‌లను…