AP Inter Hall Tickets: నేటి నుంచి ఇంటర్ హాల్‌టికెట్ల జారీ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. అయితే, ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన ప్రతి స్టూడెంట్ హాజరును ఆన్ లైన్ ద్వారా తీసుకునేందుకు ప్లాన్ చేస్తు్న్నారు. పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్‌ను జతచేసి.. ఎక్సామ్ పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా లేదా స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేందాల్లోకి ఫోన్లను నిషేదించారు.
Read Also: Dadasaheb Phalke Awards 2024: ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్.. ఉత్తమ నటిగా నయనతార!
Also Read
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
కాగా, ఎక్సామ్ పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లో కూడా ఈసారి ఇంటర్ బోర్డు అందించే ప్రత్యేకమైన బేసిక్ ఫోన్‌ను మాత్రమే వినియోగించే ఛాన్స్ ఉంది. ఇది కేవలం ఇంటర్ బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్‌లను చూసేందుకే పని చేస్తుంది. తిరిగి సమాచారం ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు ఈ ఫోన్ పని చేయ్యదు. పైగా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పని చేస్తుంది. ఈసారి ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షల కోసం పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది.ప్రాక్టికల్స్ పూర్తైన వెంటనే మార్కులను ఆన్లైన్లో ఉంచారు.. దీని కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది.
Read Also: LIVE : నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అత్యంత శుభప్రదం, అభీష్ట సిద్ధి కలుగుతుంది
అయితే, ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా ఇంటర్ బోర్డు తగిన చర్యలు తీసుకుంది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ ఎక్సామ్స్ నిన్న (మంగళవారం) ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై నజర్ పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలోని రెండు సెంటర్లలో హాల్ టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ఇంటర్ బోర్డు అధికారులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు చెల్లించాగా.. ఇందులో ఫస్ట్ ఇయర్ 4,73,058 మంది, సెకండ్ ఇయర్ 5,79,163 మంది విద్యార్థులు ఉన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!