AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. కీలక వాదనలు వినిపించిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది. వీటికి రక్షణ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం లేకుండా జీఓ 41 తీసుకువచ్చారని కోర్టులో వాదనలు వినిపించింది. ఎస్సీల నుంచి భూములు బినామీలు కొని వారే హక్కుదారుగా చూపించాలనే కుట్రతో జీఓ 41 తీసుకొచ్చారని సీఐడీ తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలు అని, వారి స్టేట్‌మెంట్‌ను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేసింది. ఈ కేసులో బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో 18 కోట్లు ఉంటే ఇప్పుడు అది 600 కోట్లు ఉందని సీఐడీ న్యాయస్థానానికి వెల్లడించింది.
Also Read: AP CM Jagan: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎం రెడ్డి
Also Read
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
చంద్రబాబు అండగా ఉన్నారనే మంత్రిగా నారాయణ ఈ బినామీ లావాదేవీలు నిర్వహించారని సీఐడీ ఆరోపించింది. సీఐడీ సీజ్ చేసిన ఫోన్స్‌లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర మాట్లాడుకున్న కాల్ రికార్డ్ గుర్తించినట్టు సీఐడీ చెప్పింది. నారాయణ, ఆయన కుమార్తె సంభాషణ కాల్ రికార్డ్‌ను పెన్ డ్రైవ్‌లో వేసి న్యాయమూర్తికి అందజేసింది. అసైన్డ్ భూముల విషయంలో అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతి లాల్ దిండే, జేసీ చెరుకూరి శ్రీధర్ ఇబ్బందులు వస్తాయని చెప్పినా మంత్రి నారాయణ పట్టించుకోలేదని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌ల మీద స్టే ఉంటే ఏ విధంగా విచారణ చేశారని పిటిషనర్ ప్రశ్నించగా.. అసైన్డ్ భూములకు సంబంధించి దాఖలైన వేరే కేసుల్లో సీఐడీ విచారణ చేయగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ చెప్పింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రోజుల వ్యవధిలో స్టే తెచ్చారని టీడీపీ వ్యవహారం అలా ఉంటుందని సీఐడీ వ్యాఖ్యానించింది. తుది విచారణలో భాగంగా రేపటికి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. రేపు పిటిషనర్ తరపున న్యాయస్థానం వాదనలు విననుంది.
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!