AP Athletes Meets CM YS Jagan who Won Medals in Asian Games 2023: ఏషియన్ గేమ్స్ 2023లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. కోనేరు హంపి, బి అనూష, యర్రాజీ నేడు జ్యోతిలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం అభినందించారు. తాము సాధించిన పతకాలను సీఎం జగన్‌కు క్రీడాకారులు చూపించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నాం అని సీఎం తెలిపారు. ఆపై స్పోర్ట్స్ పాలసీ ప్రకారం.. క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భారత్ ప్లేయర్స్ 100కు పైగా పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఏపీ క్రీడాకారులు మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు. ఏషియన్ గేమ్స్ 2023లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు సీఎం నగదు పురస్కారం అందించారు. ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ.4.29 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
1. టెన్నిస్ ప్లేయర్ మైనేని సాకేత్ సాయి ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాదించాడు. అతడికి రూ. 20 లక్షల నగదు బహుమతిని ఏపీ ప్రభుత్వం అందించింది.
2. ఆర్చరీ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ ఏషియన్ గేమ్స్‌లో 3 గోల్డ్ మెడల్స్ సాదించారు. ఆమెకు 90 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం ప్రకటించింది.
3. బాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. అతడికి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
Also Read: IND vs BAN: అందులో తప్పేముంది.. ప్రతి రోజూ ఆ అవకాశం రాదు: సన్నీ
4. బాడ్మింటన్ ప్లేయర్ ఆర్ సాత్విక్ సాయిరాజ్ ఆసియా క్రీడల్లో సిల్వర్, గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఏపీ ప్రభుత్వం అతడికి విడుదల చేసిన నగదు బహుమతి రూ. 50 లక్షలు.
5. అథ్లెటిక్స్ విభాగంలో సిల్వర్ మెడల్ విజేత యర్రాజీ జ్యోతికి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
6. ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ విజేత బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ)కు నగదు బహుమతి రూ. 20 లక్షలు.
7. ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ విజేత కోనేరు హంపి (చెస్)కి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
8. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ విజేత బి అనూష (క్రికెట్)కు రూ. 30 లక్షల నగదు బహుమతి దక్కింది.