వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ సర్కారు వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు.
గడప గడపకు కార్యక్రమం అంటే ప్రజల దగ్గరకు వెళ్లడమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక జగన్ చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు,…