పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు తీపికబురు అందించింది. వేలిముద్రల సమస్య తలెత్తే వృద్ధులకు ఆధార్ అనుసంధానంతో కూడిన లబ్ధిదారుని ముఖాన్ని అదే యాప్‌లో సరిపోల్చుకొని పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని వాలంటీర్లను ఆదేశించింది. మార్చి 1 నుంచి పంపిణీ చేసే పెన్షన్లలో ఈ విధానం అమల్లోకి రానుండగా.. ఇప్పటికే అమల్లో అన్ని విధానాలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నేడు వైఎస్ఆర్ రైతు భరోసా నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదును విడుదల చేయనున్నారు. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులను ప్రతి సంవత్సరం వేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో రైతులకు శుభవార్త.. నేడు వైఎస్ఆర్ రైతు భరోసా నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదును విడుదల చేయనున్నారు.
Also Read : Dil Raju: ‘బలగం’ చూపిస్తున్న దిల్ రాజు, ఒకే ఈవెంట్ కి ఇద్దరు గెస్టులు…
ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులను ప్రతి సంవత్సరం వేస్తుంది. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 1,090.76 కోట్లతో కలిపి ఈ మూడున్నరేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం మాత్రమే రూ. 27,062.09 కోట్లు. మేనిఫెస్టోలో ఏటా రూ. 12,500, నాలుగేళ్లు రూ. 50,000. కానీ ఇస్తున్నది ఏటా రూ. 13,500.. ఐదేళ్లు రూ. 67,500. రైతు భరోసా క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500 అందిస్తున్నారు.
Also Read : Tata Motors and Uber: టాటా మోటార్స్‌తో దేశంలోనే పెద్ద ఒప్పందం కుదుర్చుకున్న ఉబర్
వీటిలో మొదటి విడత ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500.. రెండో విడత అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోత సమయం మరియు రబీ అవసరాల కోసం రూ. 4,000.. మూడవ విడత పంట ఇంటికి వచ్చే సమయంలో జనవరి–ఫిబ్రవరి నెలలో రూ. 2,000 అందిస్తున్నారు.