AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Doctors: ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 43 మంది వైద్యుల( సివిల్ అసిస్టెంట్ సర్జన్ )పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గరిష్టంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబంధనలు అనుసరించి సంజాయిషీ నోటీసుల జారీతోపాటు అభియోగాలు నమోదు చేసినప్పటికీ స్పందన లభించనందున విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీచేశారు. గతనెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మంది అనధికారికంగా విధులకు దూరంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తప్పించారు. ఇదేవిధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోనూ జరిగేందుకు అవసరమైన చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. వీరిలో జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్ ఇతర వైద్యులు ఉన్నారు
మరో 34 మంది రాజీనామాల సమర్పణ
వాస్తవానికి 118 మంది పర్మినెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే విధుల నుంచి తప్పించవచ్చు. వీరిపై ప్రభుత్వ నిబంధన అనుసరించి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. ఈ 43 మంది కాకుండా మరో 34 మంది వైద్యులు సంజాయిషీ నోటీసులు జారీ, అభియోగాల నమోదు అనంతరం రాజీనామాలు చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించబోతుంది. అభియోగాల నమోదు అనంతరం మిగిలిన 19 మంది రాజీనామాలు చేసినందున క్రమశిక్షణ (సీసీఏ రూల్సు-1991) చర్యల్లో భాగంగా జిల్లాల వారీగా 11 మంది విచారణ అధికారులను నియమించారు. వీరి సదరు వైద్యుల నుంచి వివరణ కోరి, ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు వెల్లడించారు. అభియోగాల నమోదు అనoతరం మరో 19 మంది వైద్యులు వ్యక్తిగత కారణాలవల్ల విధులకు హాజరుకాలేదని వివరణ ఇచ్చారు. దీనిపై విచారణ జరగనుంది. సంజాయిషీల నోటీసులు జారీ జరిగిన తర్వాత 9 మంది CASlu విధుల్లో చేరారు. మరో 13 మంది వైద్యుల అభ్యర్ధనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి..
Also Read
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్‌లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్‌పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్‌న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
తాజావార్తలు
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!