Alla Nani: టీడీపీలో చేరేందుకు ఆళ్ల నానికి లైన్ క్లియర్!
- మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్
- గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని
- నేడో ,రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆళ్ల నాని చేరికకు పార్టీ పెద్దలు అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో నేడో ,రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగో సారి పోటీచేసి ఓటమి పాలైన ఆళ్ల నాని రాకను వేలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Read Also: NTV Effect: ద్వారకాతిరుమల ఆలయ పరిసరాల్లో డ్రోన్.. యూట్యూబర్‌పై కేసు నమోదు
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
2024ఎన్నికల్లో ఏలూరులో 60 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన టీడీపీకి వైసీపీ నాయకుల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క నేడు, రేపు ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీపీ అధిష్ఠానం సూచించడంతో మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిక తెలుగు తమ్ముళ్లలో కలవరం రేపుతోంది. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో వైసీపీని వీడి వచ్చిన నేతలు టీడీపీలోనే కొనసాగుతున్నారు. వైసీపీలో డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ,ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, విభజిత ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పలు పదవులు గతంలో నిర్వహించారు.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!