Andhra Pradesh: మందుబాబులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్!
- ఏపీలో అందుబాటులోకి రానున్న రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్
- సోమవారం నాటికి 20000 కేసులకి చేరుకోనున్న సరఫరా
- ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం బాటిళ్లు చేరుకోనున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధమైందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. గురువారం నాటికి పదివేల కేసుల రూ.99 మద్యం మార్కెట్‌కు చేరిందన్నారు.
Read Also: Rain Alert to AP: అక్టోబర్ 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలర్ట్
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు. దశల వారిగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందన్నారు. మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం ఈ నెలలో అందుబాటులో ఉంటుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. వినియోగాన్ని బట్టి తదుపరి నెలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!