టీడీపీ నేతలపై, లోకేష్ తీరుపై మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి. తనపై లోకేష్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. నేను మా కుటుంబం అవినీతి అక్రమాలు చేసినట్లు ధైర్యం ఉంటే నిరూపించండి. ఒక్క సెంటు భూమి నేను ఆక్రమించినట్టు చూపినా మీకే రాసిస్తా.శింగనమలకు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు.బహుశా లోకేష్ కు నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే ఉంటారని తెలియకపోవచ్చు.మండలానికి ఒక ఎమ్మెల్యే ఉంటారని నారా లోకేష్ అనుకుంటున్నాడు.లోకేష్ ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు.. తన తండ్రి భిక్షతో మండలికి వెళ్లారు.
Read Also: Ugram: హాట్ సమ్మర్ లో మంచి వెకేషనల్ సాంగ్… అల్బెలా
నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి నాకన్నా విద్యావంతురాలు. ఆమెకు నేనో మరొకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.ఆమె కు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, నియోజకవర్గ అభివృద్ధి పై పూర్తి స్థాయిలో అవగాహన వుంది.ఆమె కుటుంబ సభ్యుల్లో 20 మంది సివిల్ సర్వీసెస్ లో ఉన్నారు. నేను రాజకీయాల్లోకి రాకముందే 2007లోనే నాకు విద్యాసంస్థలు ఉన్నాయి.నేను కోట్ల రూపాయలు సంపాదించలేదు.అంతకుమించి ప్రజాభిమానం సంపాదించాను.మీ పర్యటనలో ఒక టీడీపీ ఇంఛార్జి దళిత మహిళపై దాడులు జరుగుతుంటే స్పందించలేదు నారా లోకేష్ ఒక నాయకుడైన .ఎస్సీ నియోజకవర్గంలో ఇద్దరు అగ్రవర్ణాల నేతలకు పెత్తనం ఇచ్చారు.ఈనెల 14న అంబేద్కర్ జయంతిని భారీగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు సాంబశివారెడ్డి.
Read Also: Dog attacks: సెకనుకో దాడి.. అరగంటకో మరణం.. ఐసీఎంఆర్ వెల్లడి