ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లోకి ఎక్కారు. విజయనగరంలో ఆయన మాట్లాడారు. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతుంది. చౌదరి, రెడ్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారు భూములను, వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆదివారం నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెటిలర్స్ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తానన్నారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించమని కోరతానన్నారు. అలా జరిగితే సెటిలర్స్ నష్టపోతారు.గిరిజనుల వద్ద బ్రతుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు.
Read Also: TS Inter Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు…ఎలా తెలుసుకోవచ్చంటే?
వారి కోసం వస్తున్న లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయి.సెటిలర్స్ వల్ల ఏ ప్రయోజనం లేదు. గిరిజనుల వద్ద సంపాదించుకొని అభివృద్ధి కి మాత్రం సహకరించడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలను బబ్లూ అనే సెటిలర్ అడ్డుకుంటున్నాడన్నారు రాజన్నదొర. ఇక్కడ పనిచేస్తూ అభివృద్ధి చెందుతున్న సెటిలర్లు… ఇక్కడ తమ వల్ల రోడ్లు పాడయితే పట్టించుకోవడం లేదన్నారు రాజన్నదొర.. తాజాగా డిప్యూటీ సీఎం రాజన్నదొర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సెటిలర్లు ఏమంటారో చూడాలి మరి.
Read Also: The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చూడమని కోరినందుకు వ్యక్తిపై దాడి