రేపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 8.30కు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి పవన్ బయలుదేరనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనమవుతారు. ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.20కు నాందేడ్‌లోని తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ జీ గురుద్వారాను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం సిక్కు దస్తార్ తలపాగా ధరిస్తారు. అనంతరం దర్బార్ సాహిబ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: Vizag Bus Missing: రాత్రికి రాత్రే బస్సు అపహరణ.. కారణం తెలిస్తే షాకే!
చౌర్ సాహిబ్ సేవ, అర్దాస్ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్‌కు సత్కారం చేయనున్నారు. మధ్యాహ్నం 2.10కు శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ షహీదీ సమాగమంలో పవన్ పాల్గొననున్నారు. అ తర్వాత సాయంత్రం 4 గంటలకు మోదీ మైదాన్‌లో నిర్వహించే ప్రధాన దర్బార్ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.30కు నాందేడ్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.